మీడియోన్ ప్రైవేట్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ

తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. రవీంద్ర నాయక్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ,
వైద్య & ఆరోగ్య అధికారి
డాక్టర్ టి. రఘునాథ్ స్వామి

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 8:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, సుచిత్ర, కొంపల్లి రోడ్డులోని పైప్‌లైన్ రోడ్డులో ఉన్న మీడియోన్ అనే ప్రైవేట్ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. రవీంద్ర నాయక్,
ఆకస్మికంగా సందర్శించారు.
ప్రైవేట్ హెల్త్‌కేర్ సంస్థలపై ఆయన చేసిన సమీక్షలో భాగంగా ఈ ఆకస్మిక తనిఖీ జరిగింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ,
జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి
డాక్టర్ టి. రఘునాథ్ స్వామి గారితో
కలసి రోగనిర్ధారణ సేవలు, ఔట్ పేషెంట్ మరియు ఎమర్జెన్సీ వార్డులు, లేబొరేటరీ ప్రమాణాలు, రోగి హక్కుల, ఫిర్యాదు ఫారమ్‌లు, అందించిన ఆరోగ్య సేవల జాబితా మరియు నాణ్యత, లైసెన్స్, అక్రిడిటేషన్ మరియు ఫైర్ సర్టిఫికేషన్‌తో సహా భద్రత, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మరియు నాణ్యత మరియు రోగి భద్రత కోసం ఆసుపత్రి నమోదు అంశాలను తనికీ చేశారు .

ఆసుపత్రి యాజమాన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించడంపై డాక్టర్ రవీందర్ నాయక్ సూచనలు అందించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ హెల్త్‌కేర్ సౌకర్యాలు నాణ్యతతో కూడిన ఉన్నత ప్రమాణాలను నిర్వహించేలా ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఆయన అన్నారు. మధ్యతరగతి మరియు దిగువ-ఆదాయ కుటుంబాలకు చెందిన రోగులను ఆదుకోవాలని, వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆయన ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking