హాస్పటల్ భవనం పైకెక్కి యువకుడి హల్చల్

👉 భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రానందున

👉 మనస్థాపం చెంది గడ్డి మందు సేవించిన యువకుడు

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి (మే19 ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండల పరిధిలో గల కొత్తపల్లి గ్రామానికి చెందిన మధు, అనే యువకుడు, జోగిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రి భవనం పైకెక్కి నిన్న ఆదివారం సాయంత్రం హల్చల్ సృష్టించాడు, కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, భార్య కాపురం చేయనట్టు పుట్టింటికి వెళ్లిందని, మనస్థాపంతో ఆదివారం సాయంత్రం, మద్యం మత్తులో తన ఇంటిలో గల, గడ్డిమందు సేవించాడని, కుటుంబీకులు వెంటనే 108 కు సమాచారం ఇవ్వడంతో, 108 వాహంలో అతన్ని, జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, తనతో 108,సిబ్బంది దురుసుగా ప్రవర్తించారంటూ, వారు తనకు క్షమాపణలు చెప్పాలంటూ, హాస్పిటల్ భవనం పైకెక్కి, గడియ పెట్టుకొని, తాను హాస్పిటల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ మొండికేశాడు, ఎంతసేపు వినకపోవడంతో, వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు, పోలీసులు వచ్చి నచ్చ చెప్పడంతో కిందికి దిగి వచ్చాడు, అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking