గైర్హాజర్ కార్మికులు విధులకు హాజరు కావాలి

 

నాగాల పేరిట ఉద్యోగాలు కోల్పోవద్దు

కేకే – 5 గని మేనేజర్ ప్రవీణ్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 29 :

గైర్హాజరు కార్మికులు విధులకు హాజరు కావాలని నాగాల పేరిట ఉద్యోగాలు కోల్పోవద్దని కేకే 5 గని మేనేజర్ ప్రవీణ్ తెలిపారు. బుధవారం కేకే 5 గని పై గైర్హాజరు కార్మికులకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మేనేజర్ మాట్లాడుతూ ఏ సంస్థలో లేని విధంగా సింగరేణిలో మంచి వేతనాలు ఉన్నాయని తెలిపారు. కార్మికులకు విధుల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అంతే కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా ఇతరులకు చెప్పడం ద్వారా పరిష్కారానికి మార్గం దొరుకుతుందని అన్నారు. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో నుండి కార్పొరేట్ కార్యాలయం నుండి గైర్హాజర్ కు సంబంధించి సర్కులర్ వచ్చిందని తెలిపారు. దీనిలో భూగర్భ కార్మికులు ప్రతినెల 16 మాస్టర్లు ఉపరి తల కార్మికులు 20 మస్టర్లు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గైహాజర్ కార్మికులకు ప్రతినెల కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు. తరచూ విధులకు గైర్హాజరు అయి మస్టర్లు లేక డిస్మిస్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు. దీనితో డిస్మిస్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని దీనిని అర్థం చేసుకోవాలని అన్నారు. అనారోగ్యం తో పాటు ప్రమాదాల బారిన పడి గాయాలు మానిన ఒళ్ళు నొప్పులు ఉన్నటువంటి కార్మికులు వారి పరిస్థితిని తనతో పాటు పై అధికారుల దృష్టికి తీసుకు వెళితే కొద్ది రోజులు సర్ఫేస్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పని లేకుండా విధులకు గైహాజరవుతూ అటు వారి కుటుంబాల కు ఇటు సింగరేణి సంస్థకు భారం కావద్దని విజ్ఞప్తి చేశారు. గైహాజర్ కార్మికు లు విధులకు హాజరయ్యేందుకే ఈ అవగాహన కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని చెప్పారు. వారిలో మార్పు వచ్చి విధులకు హాజరయ్యే వరకు కౌన్సిలింగ్ కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి రమేష్ సంక్షేమ అధికారి మాస్కుల కార్తీక్, ఆఫీస్ సూపరిన్ టెండెంట్ బుచ్చయ్య గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి గాండ్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking