ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ లోని సమీకృత కలెక్టరేట్ లో గల ల్యాండ్ అండ్ సర్వే కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని బుధవార్ పేటకు చెందిన సల్ల హరీష్ వద్ద సేత్వర్ కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ జగదీష్.అటెండర్ ప్రశాంత్ పట్టుబడ్డారు అనంతరం వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు