ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలు
జనాభా గణనతో హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
ఇంజనీరింగ్, శానిటేషన్, లైటింగ్, వ్యర్థ నిర్వహణపై సమీక్ష
హెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరచాలని ఆదేశాలు
జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజలు సమస్యలు తెలియజేయాలని సూచన
హైదరాబాద్, మే 17: నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు కావాల్సిన భూసేకరణ పక్రియను వేగవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి లో జరుగుతున్న అభివృద్ధి పనుల పై అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు.
నగరంలో వివిధ పథకాల ద్వారా మౌలిక వసతులు చేపట్టిన రోడ్లు, ఫ్లై ఓవర్, ముంపు నివారణకు చేస్తున ఎస్ ఎన్ డి పి, ఎస్ ఆర్ డి పి, హెచ్ సిటీ, వీధి లైట్లు, శానిటేషన్, సాలిడ్ వెస్ట్ నిర్వహణ పై మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ ఆర్.వి కర్ణన్, జోనల్ కమిషనర్లు, సి ఈ లు ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్.ఆర్.డి.పి లో చేపట్టిన అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఫలక్ నూమా ఆర్ ఒ బి పనులను జులై వరకు, శాస్త్రి పురం ఆర్ ఓ బి ఆగస్టు వరకు పూర్తి చేయాలని ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. శిల్ప లే ఔట్ రెండో దశ పనులు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉందని ప్రాజెక్టు సి ఈ భాస్కర్ రెడ్డి మంత్రికి వివరించారు. హెచ్ సిటీ ద్వారా మంజూరైన పనులు యుద్ధ ప్రతిపాదన పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. టెండర్ పక్రియ అగ్రిమెంట్ పూర్తయిన వెంటనే పనులు చేపట్టాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. పూడిక తీత పనులు వెనువెంటనే చేపట్టి వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వర్షాకాలంలో వాటర్ లాగింగ్ పాయింట్ ల వద్ద నీటి నిలువ కుండా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ప్రధాన రోడ్డు మీద కాకుండా అంతర్గత రోడ్ల పైన కూడా నిలిచే అవకాశం ఉన్నందున అక్కడ కూడా మొబైల్ స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో శానిటేషన్ పై దృష్టి సారించాలని, అవసరమైతే శానిటేషన్ వర్కర్ లను ఏర్పాటు చేయాలన్నారు.
జవహర్ నగర్ డంప్ యార్డ్ పై భారం పడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ డంప్ యార్డు ఏర్పాటుకు స్థలాలు అవసరమని శానిటేషన్ అడిషనల్ కమీషనర్ మంత్రిని కోరగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ లకు త్రిబుల్ ఆర్ కు స్థల సేకరణ చేస్తున్న నేపథ్యంలో డంప్ యార్డు కోసం స్థల సేకరణ కు చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖ ప్రత్యేకంగా పంపించిన తనకు తెలియజేస్తే ప్రభుత్వం ద్వారా కృషిచేస్తానన్నారు. చెత్త కనపడినా, వీధి లైట్లు వెలగ పోయిన బాధ్యుల పై చర్యలు తప్పవని ఈ విషయంలో బాధ్యత వ్యవహరించని వారి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. స్ట్రీట్ లైట్ వచ్చిన పిర్యాదులను పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు పరిష్కారంలో కొంత జాప్యం జరుగుతున్న దాని ఇక నుండి వీధి లైట్స్ పై వచ్చిన పిర్యాదులు రోజు వారిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నటున్నట్లు అడిషనల్ కమిషనర్ మంత్రి కి వివరించారు. మధ్యాహ్నం పూట వీధి లైట్స్ వెలగ కుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాంట్రాక్టర్ టెండర్ పూర్తయిన నందున వారి సబ్ కాంట్రాక్టర్ లకు రెండు నెలలు పొడిగించమని వీధి లైట్స్ , సామాగ్రి కొనుగోలుకు జోనల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు కమిషనర్ ఆర్ వి కర్ణన్ మంత్రి కి వివరించారు.
ఎస్ ఎన్ డి పి మొదటి దశలో చేపట్టిన బాల పనులు 90 శాతం పూర్తికాగా ఈ పనులతో 150 కాలనీ ముంపు ప్రమాద నివారణ అయినట్లు డిప్యూటీ సి ఈ వివరించారు.
వర్ష కాలంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యకువతీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నగరంలో సుందరీ కరణ పనుల పూర్తి చేయాలని స్లమ్ ఏరియాలో కూడా అవసరమైన ప్రదేశాలలో చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రస్తుతం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, వీటి కోసం ప్రభుత్వం తరపున జీహెచ్ఎంసీకి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని వెల్లడించారు. ఇంజనీరింగ్, శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశాలపై సమీక్ష జరిపి తగిన మార్గదర్శకాలు జారీ చేశారు.
తెలంగాణ జనాభాలో సుమారు 30 శాతం మంది హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నందున, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి ఒక్కరికి సౌకర్యవంతమైన జీవనం కల్పించే దిశగా అధికారులు ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన సిబ్బందిని పెంచి, శానిటేషన్ కార్యకలాపాల్లో వేగం తీసుకురావాలని ఆదేశించారు.
ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాల మీద దృష్టి పెట్టి, సన్న బియ్యం పంపిణీ, ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరచాలని, ప్రతి సమస్యను సమయోచితంగా పరిష్కరించేలా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే జీహెచ్ఎంసీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం హైదరాబాద్‌ను పారిశుధ్యం, మౌలిక సదుపాయాల పరంగా ముందంజలో ఉంచడమేనని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ ఆర్.వి కర్ణన్, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, వెంకన్న, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, ప్రాజెక్టు సిఈ భాస్కర్ రెడ్డి, మెయింటేన్స్ సి ఈ సహదేవ్ రత్నాకర్, సి సి పి శ్రీనివాస్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రామ్ నాయక్, ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, ప్రాజక్టు మెయింటేన్ ఎస్ ఈ లు, ఈ ఈ లు తదితరులు పాల్గొన్నారు.