ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పై బీఆరెస్ నేతలు పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..మహేశ్వర్ రెడ్డి అంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భయపడుతున్నారని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు ముత్యం రెడ్డి అన్నారు ప్రజల పక్షాన ప్రశ్నిచే గొంతుకగా వుంటున్నదుకే మహేశ్వర్ రెడ్డి పై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
దిలావర్ పూర్ మండల కేంద్రంలో మంత్రి దిష్టి బొమ్మ దహనం చేశారు.
ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇ బ్బందులకు గురిచేసినా, భయపడేది లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు,ఎంత మంది మీద కేసులు పెడతారో పెట్టుకొండని హెచ్చరించారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను చులకనగా చేసి,పరీక్ష పేపర్ లీకులు కమాన్ అని మాట్లాడిన చరిత్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ది ఐతే,నిరుద్యోగులకు న్యాయం జరగాలని దీక్షలు చేసిన చరిత్ర ఏలేటిని గుర్తు చేశారువిద్యా సంస్థలు స్థాపించి,ఉచితంగా కోచింగులు ఇప్పించి ఎంతో మంది నిరుద్యోగులకు దారి చూపిన నిర్మల్ ప్రజల నిజమైన సేవకుడు మహేశ్వర్ రెడ్డి అని తెలిపారు.
మున్సిపల్ ఉద్యోగాల విషయంలో తప్పులు జరిగిన మాట వాస్తవం కాదా,అని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాందేడపు చిన్ను ప్రశ్నించారు,ప్రజల నాయకులు మహేశ్వర్ రెడ్డి దీక్ష చేస్తే భయపడి మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి నియామకాలు రద్దు చేస్తున్నామని చెప్పిన మాట వాస్తవం కాదా,విచారణకు ఆదేశించిన మాట వాస్తవం కాదా,మీ పార్టీ కార్పొరేటరే మున్సిపల్ ఉద్యోగాల కోసం పార్టీ నాయకులు డబ్బులు తీసుకున్నారనిపబ్లిక్ గా వీడియో రిలీజ్ చేశారు, ఇదంతా నిజం కాదా, మంత్రిగా మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా, లేకుంటే మున్సిపల్ ఉద్యోగాల విషయంలో ఎవరు డబ్బులు తీసుకున్నారో, అక్రమాలు జరగకుంటే కలెక్టర్ గారు నియామకాలు ఎందుకు రద్దు చేశారో, బాధితులు హై కోర్ట్ ను ఎందుకు ఆశ్రయించారో బాధ్యత గల మంత్రిగా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు వేసిన విచారణలో ఏం తేలింది, lఎవరిపై చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది లేకుంటే బాధిత నిరుద్యోగులతోకలిసి ఆందోళనను మరింత ఉదృతం చేస్తాం.
నిర్మల్ పట్టణంతో పాటు దిలావర్ పూర్, సారంగాపూర్, నర్సాపూర్, నిర్మల్ రూరల్, లక్ష్మణ చందా, సోన్,మా మడ, తో పాటు ఖానాపూర్, భైంసా లోనూ నిరసన కార్యక్రమాలు నిరహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking