మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ రావెల్లి గ్రామంలో రైతులకు వరి పంటలో వచ్చే కాండం తలచు పురుగు, అగ్గి తెగులు మరియు పాము పొడ తెగులు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి పొటాష్ (MOP)ఎరువు ను ఎకరాకు 15-20 కిలోలు వేయాలని చెప్పడం జరిగింది. ఎరువుల యాజమాన్యం గురించి కూడా చెప్పడం జరిగింది.పాము పొడ తెగులు నివారణకు హెక్సాకొనజోల్ 5% Ec మందును 2 మీ. లీ ఒక్క లీటరు నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. కాండంతొలుచు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రో క్లో రైడ్ 50% SP మందును 2 గ్రా ఒక్క లీటరు నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గంగమల్లు
, ఏఈఓ సంతోష్ కుమార్, గ్రామ రైతులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.