జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తీ

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి ఏప్రిల్ 24:
మల్కాజ్గిరి – 07 పార్లమెంట్ నియోజక వర్గం ఎన్నికల నిర్వహణలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు వ్యయ, జనరల్ , పోలీస్ పరిశీలకులుగా ఎన్నికల కమిషన్ నియమించిందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ తెలిపారు. వ్యయ పరిశీలకులైన మనోజ్ అలోయిస్ లక్రా, ఐ ఆర్ ఎస్ , ధృవ్ భోళా, ఐ ఏ అండ్ ఏ ఎస్, జనరల్ అబ్జర్వర్ గా డాక్టర్ శ్రీ ఎం ఎస్.ప్రియాంక శుక్లా ఐఏఎస్, పోలీస్ ఆబ్జర్వర్ గా డాక్టర్ శ్రీ.రామేశ్వర్ సింగ్, IPSలు మర్యాద పూర్వకంగా కలిశారు. మల్కాజిగిరి జిల్లా లో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకులకు సలహాలు,సూచనలు, ఫిర్యాదులు చేయదలచిన వారు ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని వ్యయ పరిశీలకులుగా మనోజ్ అలో ఈస్ లక్రా ఐ ఆర్ ఎస్, 7337047775, ధ్రువ భోళా ఐ ఎ అండ్ ఏ ఎస్, 7337047778 , జనరల్ అబ్జర్వర్ డాక్టర్ ఎం ఎస్ ప్రియాంక శుక్లా ఐ ఎ ఎస్, 7337047776, పోలీస్ అబ్జర్వర్ డాక్టర్ శ్రీ రామేశ్వర్ సింగ్ , ఐ పి ఎస్ , 7337209990 ఫోన్ నెంబర్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు, ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటె ఈ నంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. వీరికి కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులు ఎఫ్ -26 లో జనరల్, వ్యయ, పోలీస్ అబ్జర్వర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. జనరల్ అబ్జర్వర్ డాక్టర్ ఎం ఎస్ ప్రియాంక శుక్లా ఐ ఎ ఎస్ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేసినట్లు పరిశీలకులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి పార్లమెంట్ నియోజక వర్గానికి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ, జనరల్, పోలీస్ పరిశీలకులు పరిశీలిస్తారని, ఎన్నికలు ముగిసేంత వరకు వీరు జిల్లాలో అందుబాటులో ఉంటారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking