హైదరాబాద్ మార్చ్ 10 ();ఈనెల 11వ తేదీన పెద్ద అంబర్పేటలో ని సత్యం టెక్నో స్కూల్లో 12వ వార్షికోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నా మని పాఠశాల చైర్మన్ గుజ్జ సత్యం ప్రిన్సిపల్ అరవింద్ బాబులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమైతుందని వివరించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ ఎల్ రమణలు హాజరవుతారని అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు పలు పాఠశాలల యాజమాన్యం పాల్గొంటుందని స్పష్టం చేశారు విద్యార్థుల తల్లిదండ్రుల తో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు.