రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరిన ఆరెక పూడి గాందీ

ప్రజాబలం శేర్లింగంపల్లి ప్రతినిధి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో , ప్రభుత్వ సలహాదారుడు వేమునరేందర్‌ రెడ్డి , ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ , కార్పొరేటర్లు రాగం నాగేందర్‌ యాదవ్‌ శ్రీమతి మంజుల రఘునాథ్‌ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్‌ , సీనియర్‌ నాయకులు మొవ్వా సత్యనారాయణ , మాజీ కౌన్సిలర్లు రవీందర్‌ రావు , మోహన్‌ గౌడ్‌ మరియు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం జరిగినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాసటగా నిలవలన్నదే తన లక్ష్యం అని , శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యంగా భావించి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం జరిగినది అని, నియోజకవర్గ అభివృద్దే తన ధ్యేయం అని , నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ,శ్రేయభిలాషుల అభిష్టం మేరకు మరియు వారి సూచనల మెరకు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking