పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి మే 16 ()ప్రజాబలం వరంగల్ ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో పోలింగ్ అధికారుల నియామకం, ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ఏ నెల 27న, కౌంటింగ్ జూన్ 5న ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ కు పోలింగ్ సిబ్బంది నియామకం చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 118 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన అన్నారు. 142 మంది పివోలు, 142 మంది ఏపీవోలు, 284 మంది ఓపిఓ లు అవసరం ఉన్నట్లు, ఈ దిశగా సిబ్బంది ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను పోలింగ్ విధులకు నియమించాలన్నారు. పోలింగ్ సిబ్బంది కి శిక్షణ కు ఏర్పాట్లు చేయాలన్నారు అనంతరం ఏఆర్వో లతో సమావేశమై ఏర్పాట్ల గురించి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నందున ఏ దశలోనూ తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 83879 మంది పట్టభద్రుల ఓటర్లు నమోదుకాగా, ఇందులో 50676 మంది పురుషులు, 33199 మంది మహిళలు, 4 గురు ట్రాన్సజెండర్లు ఉన్నారన్నారు. రిజర్వ్ తో కలుపుకొని 129 బ్యాలెట్ బాక్సులు అవసరం ఉందని ఆయన తెలిపారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్, 24 ఎంసిసి, 24 ప్రత్యేక వీడియో బృందాల ఏర్పాటుచేసి, నిఘా పకడ్బందీగా చేపట్టాలన్నారు. సెక్టార్ అధికారుల నియామకం పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీవోలు, తహశీల్దార్లు సందర్శన చేసి, వసతుల కల్పన చూడాలన్నారు. బ్యాలెట్ పత్రాల తనిఖీకి బృందం పోలీస్ గార్డ్ తో వెళ్లి తీసుకొని రావాలన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ ఎంతో ముఖ్యమని, ఓటరుకు తమ ఓటుహక్కు ఎక్కడ ఉందో తెలియాలని, కావున 100 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉంటుందని, రిసిప్షన్ కేంద్రం నల్గొండలో వుండనున్నట్లు ఆయన అన్నారు. రూట్ల ఏర్పాటుకు కార్యాచరణ చేసి, రవాణా ప్రణాళికా చేయాలన్నారు. బందోబస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, ఎస్డీసి రాజేశ్వరి, ఆర్డీవోలు గణేష్, రాజేందర్, కలెక్టరేట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్ లు మదన్ గోపాల్, రాంబాబు, సత్యనారాయణ, ఎంవిఐ వెంకటరమణ, ఎస్బి ఇన్స్పెక్టర్ సతీష్, ఎన్ఐసి కోఆర్డినేటర్ రాం ప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking