నేడు ఖమ్మం కు ఎంపీ నామ నాగేశ్వరరావు రాక

 

రేవు భద్రాద్రి జిల్లా దిశ కమిటీ సమావేశంలో పాల్గొననున్న ఎంపీ నామ

ఖమ్మం ప్రతినిధి జనవరి 23(ప్రజాబలం) బి.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నాయకులు , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎంపీ క్యాంప్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి ఖమ్మం జూబ్లీపురలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు అందుబాటులో ఉంటారు.

 

రేవు జరిగే భద్రాద్రి జిల్లా దిశ కమిటీ సమావేశానికి ఎంపీ నామ

గురువారం జరిగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ మాలోత్ కవిత తో కలిసి కమిటీ వైస్ చైర్మన్ అయిన ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా పాల్గొని, వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు తీరుపై శాఖల వారీగా సమీక్షిస్తారు. ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి నామినేటెడ్ సభ్యులు, ఎంపీపీ లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర వివరాలతో సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking