మణికొండకు సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డిల రాక.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 05 సెప్టెంబర్ 2024
వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మణికొండలోని వినాయక మండపాల దర్శనార్థం అతిథిలుగా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, రాష్ర్ట యువ నాయకుడు కార్తీక్ రెడ్డి లను ఆహ్వానించడానికి గాను మణికొండ బీ.ఆర్.ఎస్ నాయకులు వెళ్ళడం జరిగినది. మణికొండలోని సమస్యల గురించి సావిదానంగా విని నివారణకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని, పార్టీ పటిష్టతకై, సామాజిక కార్యక్రమాల్లో, స్థానిక సమస్యలు నివారించడానికి, పలు అభివృద్ది కార్యక్రమాలకు కార్య కర్తలు ముందుండాలని హితవు పలికారు, సందర్భానుసారంగా మణికొండలో అధ్యక్ష పదవికి అన్ని విధాలా అందరినీ కలుపుకొని పోయే తత్వం గల వ్యక్తి, బాధ్యతను సక్రమముగా నిర్వహించే సత్తా గల సీతారాం ధూళిపాళ ను నియమిస్తే బాగుంటుందని చెప్పిన వెంటనే స్పందిస్తూ రాబోయే ఆదివారం 8 సెప్టెంబర్ రోజున పార్టీ సమావేశం ఏర్పాటు చేయమని తాను విచ్చేసి పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలను కట్టబెడుతనని చెప్పడం జరిగినది. ఈ సమయంలో బీ.ఆర్.ఎస్ పార్టీ మణికొండ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంబగల్ల ధనరాజ్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, సీనియర్ నాయకులు ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, ఉపేంద్రనాధ్ రెడ్డి, యాలల కిరణ్, రాజేంద్ర ప్రసాద్, షేక్ ఆరిఫ్, రామసుబ్బా రెడ్డి, శ్రీధర్ గుప్తా, ప్రవీణ్, రఫిక్, శివ ముదిరాజ్, తిరుపతి, ఎల్లస్వామి, కృపాకర్, మొనేశ్, జైరామ్, మల్లాపురం శ్రీనివాస్, రుద్రపాటి ఉదయ్, సంగం ప్రశాంత్, చంద్రకాంత్, సాయి, జయరాం, మహిళా నాయకురాల్లు విజయ లక్ష్మి, బత్తిని కీర్తిలతా గౌడ్, సురేఖ, రేఖా, సింధు తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం గావించినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking