హైదరాబాద్ ఫిబ్రవరి 11 ();వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని అందుకు అసంబ్లిలో తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణా వడ్డెర సంఘం ఆద్వర్యం లో నేడు అసెంబ్లీ ముట్టడికి వడ్డెర నేతలు యత్నించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వడ్డెరలు అసెంబ్లీ ఆవరణకు చేరుకోవడంతో స్పంది చేరుకోవడంతో అక్కడ వారిని పోలీసులు అడ్డగించారు ఈ సందర్భంగా వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు వేముల రామకృష్ణ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రామకృష్ణను అదుపులోకి తీసుకొని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు అతి దీనవస్థలో ఉన్న వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.కాని ఇప్పటికైనా ముఖ్యమంత్రి ముఖ్య స్పందించి గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభలో వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మర గణేష్ వేముల శ్రీనివాస్ దుండగుల శ్రీనివాస్ వేముల రమేష్ కుమ్మెర శంకర్ మాగని మహేష్ దుండగుల వినోద్ కుమ్మెర నరసింహ దుండగుల బాబు తదితరులు పాల్గొన్నారు