ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 24 :;మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు దీనదయా ల్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురష్కార్ క్రింద మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు ఎంపికైనట్లు ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ లను,కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. మండలంలోని కొత్తూరు, గుల్లకోట, దౌడేపల్లిలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గుల్లకోట సర్పంచ్ గోళ్ళ రవీందర్, కొత్తూరు సర్పంచ్ సొల్లు సురేష్, దౌడేపల్లి సర్పంచ్ శ్యామల అదేవిధంగా గ్రామ కార్యదర్శులను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అన్నం మంగ, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,ఈవోపీర్డీ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.