జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. టి. రఘునాథస్వామి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 4:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ & డయాగ్నోస్టిక్స్ సెంటర్ సమావేశ మందిరంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి స్వస్తవ క్యాన్సర్ కేర్ మద్దతు అందించింది.
కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ టి. రఘునాథస్వామి మాట్లాడుతూ, క్యాన్సర్ నివారణ, నియంత్రణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఎన్ పి సి డి సి ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నోటి, రొమ్ము , గర్భాశయ ముఖం క్యాన్సర్ల స్క్రీనింగ్ ఎన్ ఎన్ పి సి డి సి ఎస్ లో కీలక భాగమని తెలిపారు. క్యాన్సర్ నియంత్రణలో స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు, నిర్వహణ, తగిన ఆరోగ్య సంస్థలకు రెఫరల్ కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో ఎన్ పి సి డి సి ఎస్ & ఆరోగ్య మహిళా కార్యక్రమాలు ప్రతి మంగళవారం నాడు జిల్లా వ్యాప్తంగా
12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
38 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,
117 బస్తీ దవాఖానాలు
70 పల్లె దవాఖానాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
క్యాన్సర్ పరిశోధన, నివారణ మార్గాలు, టీకాలపై పలువురు నిపుణులు విలువైన సూచనలు ఇచ్చారు. క్యాన్సర్ నుండి కోలుకున్న సర్వైవర్లు తమ అనుభవాలను పంచుకుంటూ, సాధారణ ప్రజల్లో క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సాహించాలన్నది అత్యవసరం అని అన్నారు.
ఈ లక్ష్యాన్ని గ్రామ స్థాయిలో ఎ ఎన్ ఎమ్/ఆశ కార్యకర్తలు సమర్థవంతంగా అమలు చేయగలరని తెలిపారు తదుపరి సీడీఎఫ్డీ కార్యాలయం నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు క్యాన్సర్ అవేర్నెస్ వాక్ నిర్వహించి మానవహారం చేసి ప్రజలకు అవగాహన కలిగేలా చేశారు.
ఈ కార్యక్రమంలో
ప్రొఫెసర్ ఉల్లాస్ కోల్తూర్ సీతారాం, డైరెక్టర్,
డాక్టర్ వి. చతుర్వేది, వ్యవస్థాపకుడు,
స్వస్తవ క్యాన్సర్ కేర్
డాక్టర్ రామచంద్ర మూర్తి, వైస్ ప్రెసిడెంట్, స్వస్తవ క్యాన్సర్ కేర్
డాక్టర్ సత్యవతి, డిప్యూటీ డీఎమ్‌హెచ్‌ఓ, కీసర డివిజన్
డాక్టర్ శోభా రాణి, డిప్యూటీ డీఎమ్‌హెచ్‌ఓ, మల్కాజిగిరి డివిజన్
డాక్టర్ మల్లిశ్వరి,
జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్,
డాక్టర్ శ్రీదేవి, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్,
డాక్టర్ గీత, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్,
డాక్టర్ చంద్రకళ, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్,
డాక్టర్ శౌషీల్య, వైద్య అధికారి, ఉప్పల్ సూపర్వైజర్
జిల్లా ఎన్సీడీ కోఆర్డినేటర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
ఉప్పల్ సిబ్బంది పాల్గొన్నారు