సైబర్ నేరాలపై అవగాహన సిఐ వరగంటి రవి

 

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి జూలై 19

జమ్మికుంట మండలం శాయంపేట గ్రామంలో గ్రామస్తులను ఉద్దేశించి జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి. సైబర్ నేరాల పైన యువత చెడు మార్గంలో వెళ్లకుండా పలు సూచనలు ఇచ్చినారు. మైనర్లు డ్రైవింగ్, చేయరాదని, డ్రగ్స్ (గంజాయి) లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడవద్దని. యువత చెడు మార్గంలో పోయి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురావద్దని. ఎల్లవేళలా మంచి మార్గంలో నడవాలని చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని. ఊరిలో గంజాయి మాదకద్రవ్యాలు ఎవరి దృష్టికి అయినా వస్తే పోలీసులకు సమాచారం అందించాలని, నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై తగు చర్యలు తీసుకుంటామని. జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి సూచనలు చేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking