బారాస ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

 

ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి

కుభీర్ లో బారాస ఆత్మీయ సమ్మేళనం
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. బారాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు,నాయకులు కృషి చేయాలని ముధోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి పిలుపునిచ్చారు, శుక్రవారం కుభీర్ లో గ్రామంలో నిర్వహించిన
బారాస పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు,ముందుగా బారాస పార్టీ జెండాను ఆవిష్కరించారు,అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.బారాస పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నాయకుల,కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తామన్నారు,
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు,సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జాతీయస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు,సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపాలిస్తున్నారని అన్నారు,రైతులకు రైతు బంధు,రైతు భీమా వంటి పథకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు, కార్యకర్తలు,నాయకులు అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు,పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని అన్నారు,ఈ కార్యక్రమంలో
బారాస అధ్యక్షుడు ఎన్నిల అనిల్ బరస ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్ మాజీ జడ్పీటీసీ శంకర్ చవాన్ పిఏసీఎస్ చైర్మన్ గంగా చరణ్ వైస్ ఎంపీపీ మోహింవుద్దీన్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రమేష్ ఆయా గ్రామాల రైతు సమనవయ కమిటీ అధ్యక్షులు మార్కెట్ మాజీ చైర్మన్ సంతోష్ ఆయా గ్రామ్ల సర్పంచులు ఎంపిటిసి,కార్యకర్తలు,
తదితరులు,పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking