పాత్రికేయుల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ప్రణాళిక ప్రకారం సమాచార వ్యవస్థను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవడంతోపాటు, సాంకేతిక పరిజ్ఞానంను వినియోగిస్తున్న నిర్మల్ జిల్లా పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించి జటిలమైన కేసులను సైతం చేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి హత్య మిస్టరీని ఛేదించిన తీరు, నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 1న బాసర మండల కేంద్రంలోని శారదా నగర్ వెనుకన గల టవర్ వద్ద యువకుడిని హత్య చేసి ముళ్ళకంప లో వేసి కాల్చివేసిన ఉదంతంపై జూన్ 1 న బాసర పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని మృతదేహం హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు,ఇట్టి కేసును తీవ్రంగా పరిగణించడంతో ఎస్పీ ఆధ్వర్యంలో ఎ.ఎస్.పి భైంసా, ముధోల్ సీఐ, బాసర ఎస్ఐ దర్యాప్తు చేసినట్లు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా గుర్తు తెలియని మృతదేహంను ఫకీరాబాద్ కి చెందిన అర్జున్ గా గుర్తించి గత 35 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరించి దర్యాప్తుని వేగవంతం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ లో డేటా ఆధారంగా స్థానికంగా సేకరించిన సాక్ష్యాధారాలతో గుర్తించిన నిందితులు సిసిఎల్1 to 3 బాసర, సగ్రోలి (బిలోలి) చెందిన ముగ్గురు వ్యక్తులు. జూన్ 1 న ప్రొద్దున 3 నుండి 4 గంటల ప్రాంతం లో హతుడు అర్జున్ ధర్మబాద్ లో గల ప్రణయ్ టీ షాప్ దగ్గర నేరస్థులు ఉండగా వారిని ఫోన్ చేసుకుంటా అని వారి మొబైల్ నుండి హతుడు తన పడిపోయిన ఫోన్ కు డయల్ చేసినాడు. తర్వాత నేరస్తులు వారి ద్విచక్ర వాహనం మీద బాసరకు వెళ్లడం గమనించి వారిని హతుడు లిఫ్ట్ అడుగగా వారు నిరకరించి నందుకు హతుడు త్రాగిన మైకంలో వారిని బూతూ మాటలు తిట్టి గొడవ పడి నాడు. దానికి నేరస్థులు కోపం లో అతడిని చంపుదామని అనుకుని హతుణ్ణి అదే ద్విచక్రవాహనంపై కూర్చుండ పెట్టుకుని నలుగురు ఒకే బైక్ పై బాసర ఖాజా హోటల్ దగ్గర రాగానే నేరస్తులు మళ్ళీ హతుణ్ణి కొట్టగా హతుడు మళ్ళీ వారిని బూతూ మాటలు తిట్టినాడు.తరువాత నేరస్థులు హతుణ్ణి టవర్ పక్కన తీసుకెళ్లి అక్కడ దొరికిన కట్టేతొ తలపై కొట్టగా కింద పడిపోయినాడు. వెంటనే అందులో నుండి ఒకరు హతున్ని పట్టుకోగా మరొకరు పెద్ద బండ రాయి తీసుకుని మెడ పై పారేసి హత్య చేసి పక్కన ఉన్న ముళ్ళకంప పై హతుణ్ణి వేసి నిప్పు పెట్టి అక్కడి నుండి పారిపోయారని తెలిపారు.పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యల్లో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 7 న ఆదివారం ఉదయం బాసర రైల్వే స్టేషన్ దగ్గర అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను విచారించగా నేరం ఒప్పుకొని నేరస్తులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని మరియు ఫోన్ లను పటిష్టమైన సాక్ష్యాధారాలు, ఆధినిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి కేసు దర్యాప్తును పూర్తి చేసి న్యాయస్థానంలో నిందితులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నిందితులకు కఠినంగా శిక్షపడే విధంగా న్యాయస్థానంలో తుది నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. గుర్తుతెలియని శవంను ముందుగా గుర్తించి హత్యకు దారి తీసిన ఉదంతాన్ని చాకచక్యంగా దర్యాప్తు చేసి చేదించిన ఎ.ఎస్.పి భైంసా అవినాష్ కుమార్ ఐపీస్, ముధోల్ సీఐ జి.మల్లేష్ బాసర ఎస్ఐ కే.గణేష్ ,బృందం సభ్యులను మరియు జిల్లా ఐటీ కోర్ టీం సిబ్బంది అయిన రామకృష్ణ, శ్రీనివాస్, నరేందర్, కిరణ్, రాజేశ్వర్ లను అభినందిస్తూన్నట్లు పేర్కొన్నారు.