జోగులాంబ గద్వాల జిల్లా బిసి సంఘం అధ్యక్షుడు తట్టే మహేష్ పిలుపు
అలంపూర్ ఆగస్టు 23 ();బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్ల కేటాయింపు జరగలేదు. కారణం బీసీల ఐకమత్య లోపం, వాళ్లు చూపించే ప్రలోభాల బానిసత్వం కాబట్టి వీటికి లొంగకుండా బీసీలు రాజ్యాధికారం వైపు పయనించే విధంగా ఒకటై ముందడుగు వేయాలని బీసీ సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు తట్టె మహేష్ బీసీ సామాజిక వర్గానికి పిలుపు నిచ్చారు.అయిజ మండల కేంద్రంలో బిసి సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు తట్టె మహేష్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ స్థానాల జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు శాతం ఉండే రెడ్లకు 39 సీట్లు, 0.5 శాతం ఉండే వెలమలకు 9 సీట్లు కేటాయించారు. కానీ 60% పైగా ఉన్న బీసీలకు కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చారు. కాబట్టి బీసీలు కలిసి ఐకమత్యంతో పోరాడితే ప్రధాన రాజకీయ పార్టీలు దిగివచ్చి జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయింపు చేస్తారు. లేదంటే తాత్కాలిక సంక్షేమ పథకాలకే పరిమితం చేసి బీసీలను ఓటు బ్యాంకుగానే చూసి జెండాలు మోసే కార్యకర్తలుగానే చరిత్రలో మిగిలిపోతారని తెలిపారు. కాబట్టి అందరు ఐకమత్యంతో కలిసి మేమెంత జనాభా ఉన్నామో మాకు అన్ని సీట్లు ఇవ్వాలని, ఓట్లు మనమే సీట్లు మనవే అనే నినాదంతో ముందుకు సాగుతూ పోరాడాలని విజ్ఞప్తి చేశారు. 2023 లో సామాజిక వర్గాల వారిగా టికెట్ల కేటాయింపు చూసుకుంటే 116 మందితో తొలి జాబితా తీసుకుంటే రెడ్డి జనాభా 5శాతం ఉండగా వారికి 39 సీట్లు, బీసీలలో 136 కులాలు, 60 శాతం జనాభా ఉన్న వారికి 23 సీట్లు, ఎస్సీలు 17 శాతం జనాభా ఉండగా 18 సీట్లు, ఎస్టి లు 10 శాతం ఉండగా 9సీట్లు, వెలమ లు 0.5 శాతం ఉండగా 9 సీట్లు, కమ్మ 1శాతం ఉండగా 6, ముస్లింలు 12 శాతం ఉండగా 9 సీట్లు, బ్రాహ్మణ 1శాతం జనాభా ఉండగా 2 సీట్లు, వైశ్య 1 శాతం జనాభా ఉండగా 1 సీటు కేటాయించారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రకటించిన జాబితాలో కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్ల కేటాయింపు జరగలేదు. కారణం బీసీల ఐకమత్య లోపం, వాళ్లు చూపించే ప్రలోభాల బానిసత్వం కాబట్టి వీటికి లొంగకుండా బీసీలు రాజ్యాధికారం వైపు పయనించే విధంగా ఒకటై ముందడుగు వేయాలని బీసీ సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు తట్టె మహేష్ బీసీ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.