పార్లమెంటు సాక్షిగా మహిళలకు ద్రోహం

 

మహిళా ఉద్యమకారులను మరిచిన కేసీఆర్

మహిళా దినాస్ సందర్భంగా సోనియాగాంధీకి పాలాభిషేకం

మహిళా దినాస్ సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు ఉపాధి కూలీలకు అందజేసిన కాంగ్రెస్ కౌన్సిలర్స్

పెద్దపల్లి ప్రజాబలం జూన్ 13÷

సాధించిన తెలంగాణలో మహిళా ప్రగతి శూన్యమని ఉద్యమ కాలంలో పార్లమెంటు సాక్షిగా మహిళల కు ఇచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను అధికార పీఠం నుంచి దించాలని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ ఫోరం ధ్వజమెత్తింది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా దినాస్ సందర్భంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మంగళవారం రోజున పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీల మధ్య కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పాలాభిషేకం జరిపారు ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు.

నాటి ఉద్యమ నిర్మాణంలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడికి వెళ్లిన మహిళా ఉద్యమకారులతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కాగానే మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తానని అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ మహిళల ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడు అందించడం లేదని వారు విమర్శించారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని వారు గుర్తు చేశారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా దినాస్ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాని ఇచ్చిన సోనియా గాంధీ, సహకరించిన నాటి పార్లమెంటు స్పీకర్ మీరా కుమారి మరియు నాటి బిజెపి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించకపోవడం మహిళ లోకాన్నే అవమాన పరచినట్లు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఫోరం పేర్కొంది. మంగళవారం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో జరుగుతున్న మహిళా దినోత్సవంలో వీరి ముగ్గురిని స్మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేయవలసిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ప్రభుత్వంపై ఉందని వారు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి యువత బానిసలుగా మారి లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా అణగారి పోతున్నారని వారు తెలిపారు. 35 మరియు 45 సంవత్సరాల మధ్య మహిళలు కుటుంబ యజమానిని కోల్పోయి కుటుంబ భారాన్ని మోస్తూ నాన అవస్థల గురవుతున్నారు అని వారన్నారు. ఒక సామాజిక సర్వేలో తేలింది ఏందంటే మద్యం మహమ్మారికి గురై కుటుంబ యజమానులు చనిపోవడంతోనే ఈ పరిస్థితి తెలంగాణలో నెలకొందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడవద్దని వారన్నారు.

ఈ ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ నూగిళ్ల మల్లయ్య, భూత గడ్డ సంపత్, తూముల సుభాష్ రావు, తాడూరి పుష్పకళా శ్రీమాన్, నేత్తేట్ల స్వరూప కుమారులతోపాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking