ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 05 : ప్రభుత్వ ఆసుపత్రిలో ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిని ఆర్.ఎం.ఓ భీష్మ తో కలిసి ఆసుపత్రిలోని పలు వార్డులు,ల్యాబ్,ఫార్మసీ, ఆసుపత్రి పరిశీలించి ఆటో యూనియన్ వారితో కలిసి ఆసుపత్రి ఆవరణలో గర్భిణులు,పసిపిల్లలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆదునిక పరికరాలు,పూర్తి సౌకర్యాలు కల్పించి సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పిల్లల సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఆసుపత్రిలో వార్డు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మేను ప్రకారం ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని చెప్పాలని,సిబ్బందిలో గైర్హాజరు అయిన వారి వివరాలు ప్రతి రోజు అందించాలని,విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని,జనరేటర్ ను ఎల్లప్పుడూ పని చేసేలా పర్యావేక్షించాలని తెలుపారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలకు త్రాగునీటీ అందించేంకు ఏర్పాటు చేసిన ఆర్.ఓ.ప్లాంట్ నిర్వహణను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ అలివేణి, డాక్టర్ కీర్తి, సంబంధిత అధికారులు,ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.