జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రీ వేణు మాధవ్
విశాఖపట్నం ఫిబ్రవరి 21 ;ఎమ్మెల్సీ స్థానాలలో బిసి లకు పెద్దపేట చారిత్రాత్మకమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రీ వేణు మాధవ్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చారిత్రాచకమైనటువంటి విషయం జరిగిందని ఇది దేశంలో అన్ని భాషల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని బడుగు బలహీన వర్గాలకు ఇది నిజంగా రాజ్యాధికార పండుగ రోజని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రీ వేణు మాధవ్ అన్నారు. నిజంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతటి సాహసమైన నిర్ణయం తీసుకోలేదని వేణుమాధవ్ అన్నారు వాస్తవానికి రాజకీయ పార్టీలన్నీ కూడా రాజ్యసభ మరియు ఎమ్మెల్సీ స్థానాలను తమ పార్టీ ఆర్థికమైన బలోపేతం కొరకు కార్పొరేట్ వారికి లేదా ఆశిస్తున్నటువంటి ఆయా వర్గాల ఉన్నత వర్గాలకి ఇచ్చే సాంప్రదాయం ఇప్పటిదాకా కొనసాగింది దానిని తిరగరాసిన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కర్రి వేణుమాధవ్ అన్నారు. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 75% అంటే 11 బీసీలకు 2 ఎస్సీలకు 1 ఎస్టిలకు అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయమని ఇది దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అవలంబించే విధంగా బడుగు బలహీన వర్గాలు ప్రజాసంఘాలు ప్రచారం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇప్పటికే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో 40 సంవత్సరాల పోరాటం చేస్తుంటే బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీలు కూడా తీసుకొని నిర్ణయాన్ని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం అభినందనీయమన్నారు.