బీజేపీ పార్టీలోకి 100 మంది యువకులు చేరిక బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 20 : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనకు ఆకర్షతులై మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ పోరాటం,వారు ప్రజలకు చేసే సేవ కార్యక్రమాలను గుర్తించి గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట క్రిష్ణ ఆధ్వర్యంలో అక్కల సుజిత్ వర్మ,కొట్టె శేఖర్,గడ్డం మధు,సాయి సందీప్ గార్లతో పాటుగా సుమారు 100 మంది యువకులు బీజేపీ లో చేరడం జరిగింది.వారికీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలు వారి పరిపాలన కేవలం వారి కుటుంబాల లబ్ది కోసమే అన్నటుంటుంది.కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలచే నిర్మితమైన పార్టీ అని ప్రజల పార్టీ అని అన్నారు,స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దివాకర్ రావు అసమర్ధత వల్ల మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు ఏరోజు కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడింది లేదు అని అన్నారు కేవలం గుండాగిరి చేస్తూ కబ్జాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ప్రేమ్ సాగర్ బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా వ్యవహారిస్తున్నాడు అని అన్నారు, బీఆర్ఎస్ పార్టీలో దివాకర్ రావు కొడుకుకి ఏం ప్రోటోకాల్ ఉంది అని బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీల్లో పెద్ద ఫోటో వేసుకుంటున్నారు అని ప్రశ్నిచారు.మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న పార్టీల్లో ఒకటి అయ్యా కొడుకుల పార్టీ అయితే మరొకటి మొగుడు పెళ్ళాల పార్టీ అని అన్నారు.ప్రజలుకు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచిపోవడం వల్ల మరియు కాంగ్రెస్ పార్టీ గుండా గిరి కబ్జాలు చేయడం వల్ల ప్రజలు వారిని నమ్మే పరిస్థితితుల్లో లేరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ని గెలిపిస్తారు అని,మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గంలో కూడా కాషాయం జెండా ఎగారావేస్తాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజనీష్ జైన్, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరావు, పానుగంటి మధు, బోయిని హరి క్రిష్ణ,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్,దుగ్నే సాయి,బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking