జగిత్యాల, ఫిబ్రవరి 13: భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులుగా చల్ గల్ గ్రామానికి చెందిన అబ్బూరి మల్లేశం గౌడ్ ను రూరల్ మండల అద్యక్షులు నలువాల తిరుపతి నియామక పత్రం అందజేశారు. సోమవారం తన నివాసంలో నియామక పత్రం అందజేసిన తదుపరి తిరుపతి మాట్లాడుతూ బిజెపి గ్రామ గ్రామాన బలోపేతం దిశగా నియామకాలను చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగానే అబ్బూరి మల్లేశం గౌడ్ నియామకమన్నారు. బీజేపీని గడప గడపకు చేర్చేలా కృషిచేయాలని తిరుపతి సూచించినట్లు మల్లేశం గౌడ్ పేర్కొన్నారు. తన నియామకానికి కృషిచేసిన జగిత్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ రావు, అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్, రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి, బిజెపి నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, డాక్టర్ శైలేందర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, జిల్లా చేనేత సెల్ కన్వీనర్ కొక్కుల గణేష్ లకు ఈ సందర్భంగా మల్లేశం కృతజ్ఞతలు తెలిపారు.