బిజెపి కంటే బిఆర్ఎస్ వల్లనే ప్రమాదం

 

ముస్లింలు జాగ్రత్త పడాలి

ఖమ్మం రాజకీయాలలో మీరెక్కడ

పాల్వంచ రామారావు హెచ్చరిక

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 14 (ప్రజాబలం) ఖమ్మం ముస్లిమ్ ఆర్గనైజేషన్ జేఏసీ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు జిల్లా తెలుగుదేశం నాయకుడు పాల్వంచ రామారావు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకిచ్చిన ఏఒక్కహామీని నెరవేర్చక పోగా రాజకీయ పదవుల్లో కూడా నామమాతృపు పదవులిచ్చి ప్రజలతో సంబంధాలు లేకుండా దూరం చేశారన్నారు మీకు కూడా కొన్ని రాజకీయ పదవులు కావాలని ఎందుకు అడగటం లేదని ముస్లింలను సూటిగా ప్రశ్నించారు అయినాదానికి కానిదానికి ముస్లింల మీద ఈగ వాలకుండ కాపాడుకుంటామని అండగా ఉంటామని బిఆర్ఎస్ నాయకులు అదే పనిగా మాట్లాడుతుంటారని ముస్లిములు ఏం తప్పులు చేస్తే కాపాడుతారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు సోదర భావంతో ఉన్న హిందువులను దోషులుగా చూపించి ఓట్లు దండుకోవాలనే కుట్ర అన్నారు గౌరవప్రదమైన రాజకీయ పదవులేమి ఇవ్వకుండా ముస్లింలకిచ్చిన హామీలను మర్చిపోవడానికి ప్రభుత్వ నిధులతో చేసిన ఇఫ్తార్ విందుల పేరుతో నాటకాలాడటమేంటని మండిపడ్డారు బిఆర్ఎస్ నాయకులు ముస్లిములను గోల్మాల్ చేస్తున్నారన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు గోల్మాల్ కాని స్కీములేవి లేవన్నారు ముస్లిం డిక్లరేషన్ తోపాటు న్యాయమైన కోర్కెలన్నిటికి మద్దతిచ్చి అండగా ఉంటామన్నారు జిల్లా కన్వీనర్ షేక్ అబ్దుల్ రహమాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎండి జమీల్ ఎండి ముదసిర్ అలీ ఎంఏ గఫార్ ఎండి జమాలుద్దీన్ సయ్యద్ రఫీ షేక్ మస్తాన్ యూసుఫ్ మొయినుద్దీన్ డాక్టర్ ఖిజార్ ఎంఏ అబ్దుల్ అజీజ్ ఎంఏ నయీమ్ షేక్ అబ్దుల్ షేక్ మన్సూరలి అర్షద్ ఎస్ డి సలీం డాక్టర్ మహమ్మద్ సాద్ మహమ్మద్ పాషా,రఫీ సయ్యద్ సుజా మొదలగు వారు ప్రసంగిస్తూ తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం చేస్తామన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking