రైతుల కష్టాన్ని దోచుకుంటున్న బి ఆర్ ఎస్ నాయకులు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 29 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని గురు నానక్ ఫంక్షన్ హాల్ లో సోమవారం నిర్వహించిన బిజెపి పట్టణ,మండల కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధాన్యాన్ని తరుగు పేరుతో రైస్ మిల్లర్ల తో కలిసి ఎమ్మెల్యే దివాకర్ రావు, బిఆర్ఎస్ నాయకులు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు.ఒక్క పక్క కలెక్టర్ ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రైతుకు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రసీదు ఇస్తున్నామని చెప్తున్న వాస్తవానికి కొనుగోలు కేంద్రం వద్ద ప్రతి బస్తా కు 2 నుంచి 4 కేజీలు తరుగు తీసి రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎమ్మెల్యే అండదండలతో రైస్ మిల్లర్లు, బిఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని వాపోయారు.కొనుగోలు చేసిన వెంటనే రైతుకు రసీదు ఇవ్వకుండ ధాన్యం బస్తాలు రైస్ మిల్లుకు వెళ్లాక మళ్ళీ ప్రతి లారీకి 10 బస్తాలు కోత విధించి రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులు రసీదు ఇవ్వలని డిమాండ్ చేశారు. అదే విధంగా గత ఎన్నికల సమయంలో పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని ఇప్పుడు దాన్ని 30 పడకలకు తెచ్చారని ఇచ్చిన హామీ మేరకు 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజినిష్ జైన్,అరుముల్ల పోషం, రవీందర్ రావు,గుండా ప్రభాకర్,వీరమళ్ల హారి గోపాల్,నాగిరెడ్డి హేమంత్ రెడ్డి,తోట సతీష్, శ్రీరామ్,వేముల మధు బిజెపి నాయకుడు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking