బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల సందడి లేని ప్రారంభోత్సవాలు

 

రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక శాసన సభ్యులు టి. ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో 18-05-2023 గురువారం రోజున నియోజకవర్గ అంతర్ భాగమైన మణికొండ మునిసిపల్ కౌన్సిల్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ యందు రెండు కోట్ల అంచనాలతో సీ సీ రోడ్డు పనుల ప్రారంభోత్సవమ్, ఫ్రెండ్స్ కాలనీలో యాభై లక్షలతో పార్క్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవమ్, డ్రైవర్ కమ్ ఓనర్ పద్దతిపై లబ్ది దారుల కొరకు ముప్పై లక్షల పెట్టుబడితో కొన్న పదిహేను ఆటోలు మున్సిపల్ కార్యాలయం నందు ప్రారంభోత్సవ కార్యక్రమమ్ మరియు చిత్రపురి కాలనీలో బస్తి దవాఖాన ప్రారంభోత్సవాలలో స్థానిక మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్, కమిషనర్ ఫాల్గుణ కుమార్, కౌన్సిలర్ లక్ష్మినారాయణ, పద్మారావు, బుద్దోల్ మీనా ముత్యాలు, కో ఆప్టెడ్ సభ్యుడు తాజుద్దీన్, డీ ఈ దివ్య జ్యోతి, ఏ ఈ సాయి మౌనిక లు నిర్వహించడం జరిగినది, ఇట్టి కార్యక్రమంలో స్థానిక బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మహిళ నాయకురాల్లు, యువ నాయకులు, కార్యకర్తలు లేని లోటును ప్రజలందరూ గమనించి పార్టీ పరిస్థితిని చూసి నోరెల్ల బెట్టడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking