ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ రాజకీయాలు

 

జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్.

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్, ఆర్ఎంపి.& పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అప్సర్, గరిగే నర్సింగరావు అన్నారు. ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కే.టీ.ఆర్…
కౌశిక్ రెడ్డి ఇద్దరినీ ఖండిస్తూ ఈసందర్భంగా మాట్లాడుతూ బా.రా.స. నాయకులు రాజకీయ ప్రయోజనం తప్ప తెలంగాణ ప్రజలకు ఒరగ బెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీపై చర్చ జరగకుండా ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా చేస్తున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి శవ రాజకీయం ద్వారా ఎమ్మెల్యేగా గెలిచి విచ్చలవిడిగా
మాట్లాడుతున్నాడని వారు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలలోపే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని జీర్ణించుకోలేక బిఆర్ఎస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రయత్నం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ కుట్రను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking