వ్యతిరేకిస్తున్న అయ్యప్ప భక్తులు
తుగ్లక్ చర్యలా ఉంది… ఎ.బి.ఎ.పి ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమల రావు
(కూకట్‌పల్లి, ప్రజాబలం న్యూస్)
మే: 08
శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి స్పాట్ బుకింగ్ పద్ధతిని నిలిపివేసి, రోజుకు 80 వేల మంది భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించాలని దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకోవడం తుగ్లక్ చర్యలా ఉందని, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమల రావు ఆరోపించారు. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమల రావు మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల క్రితం పోలీసుల ఆధ్వర్యంలో శబరిమల వర్చువల్ క్యూ వ్యవస్థ ప్రారంభమైందన్నారు. పెద్దగా సమస్యలు లేకుండా ముందుకు పోయిన వర్చువల్ క్యూ రెండు సంవత్సరాల క్రితం పోలీసుల నుండి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలోకి తీసుకుందని, అప్పటి నుండి భక్తులకు సమస్యలు ప్రారంభమయ్యాయన్నారు. పోలీసులతో ఈగో సమస్య తీవ్రమైందని, అందువల్ల గత శబరిమల సీజన్‌లో తీర్థయాత్ర దర్శనం కోసం 12 గంటల నుండి 18 గంటల వరకు భక్తులు క్యు లైన్లలోనే వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
గత సంవత్సర కాలం పాటు భక్తులు వచ్చిన సీజన్‌లో కూడా ఇంత కంటే ఎక్కువ సమయం దర్శనం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. స్పాట్ బుక్కింగ్ నిలిపివేయబడటానికి అదనంగా ఆన్‌లైన్ బుకింగ్, మండల కాలం ప్రారంభమయ్యే ముందు మూడు నెలల్లోపు ప్రారంభం కాబోతుందన్నారు.
తిరుమల తిరుపతి నమూనా అమలు గురించి దేవాదాయ శాఖ బోర్డు చెబుతోందన్నారు. కాని తిరుపతిలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులు అందజేస్తున్నాయన్నారు. క్యూ లో నిలబడిన భక్తులకు ఆహారం, నీళ్లు అందుతున్నాయన్నారు. కాని శబరిమలలో భక్తులకు నీరు కూడా ఇవ్వడానికి వ్యవస్థ లేదన్నారు. అలాగే, తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మొదలైన రాష్ట్రాల నుండి భక్తులకు కొత్త నియంత్రణ తెలియకుండా ఇబ్బందులు పై అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా నగరంలో వివిధ అయ్యప్ప భక్తసంస్థలు, గురువులతోపాటు సంబంధిత వ్యక్తులకు సమావేశం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా తీర్మానించారు. రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ అధ్యయనం అవసరమని ఎ.బి.ఎ.పి నేషనల్ ప్రెసిడెంట్ అయ్యప్పదాస్ తెలిపారు.