ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 16 (ప్రజాబలం) ఖమ్మం కతోలిక చర్చి నందు (లేటీ) సామాన్య గృహస్తు కమిషన్ల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా కరుణ గిరిలో నిర్వహించి నారు ఈ వేడుకలకు బిషప్ ఉడుముల బాల హాజరయ్యి క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ పంచినారు . ఈ సందర్భంగా యేసుప్రభు సర్వమానవాళికి శాంతిని ప్రసాదించడానికి వచ్చారని ప్రజలందరూ శాంతి సమాధానాలతో జీవించాలని కోరినారు ఐక్యమత్యం పెంపొందించుకోవాలి అని సోదర భావాన్ని ప్రేమను కనికరాన్ని పెంపొందించుకొని ఒకరికొకరు సహజీవనం చేయాలని సమాజంలో అభివృద్ధిని సాధించాలని బోదించినారు . ఈ కార్యక్రమంలో కమిషన్ కార్యదర్శి ఫాదర్ .ఏ. సునీల్ పాదర్లు లేటీ గృహస్తు కమిషన్ వారు సంఘస్తులు మరియు సంఘ పెద్దలు ఉపదేశులు సిస్టర్లు తదితరులు హాజరైనారు కమిటీ ఆధ్వర్యంలో బిషప్ ను ఘనంగా సన్మానం చేసినారు జ్యోతి ప్రజ్జనల తో కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమాల నివేదికను క్రీస్తు ప్రభువు సందేశాన్ని ముత్తమాల.ప్రసాద్ తెలియ చేసినారు క్రిస్మస్ సందేశాలను కొమ్ము ప్రసాద్ పిల్లి సుందరి బోధించినారు బైబిల్ పటణాలను చదివి వినిపించినారు మరియు వివిధ చర్చ్ ల నుండి హాజరైన ప్రతినిధులు సంఘ పెద్దలు సంగస్తులు బిషప్ ను సన్మానం చేసినారు . కరుణగిరి , నాయుడుపేట , గుట్టల బజార్ , జాన్ మజ్జుకోని చర్చ్ వారు క్రిస్మస్ పాటలను పాడి వినిపించారు . అతిథులుగా ఫాదర్ లు వరప్రసాద రాజు సుధాకర్ ఫాదర్ మాదాను రాజు గోవా శౌరయ్య జి .సురేష్ డేవిడ్ ఇమ్మానియేల్ , కరుణగిరి చర్చి సిస్టర్లు పాల్గొన్నారు మరియు వివిధ చర్చల నుండి సంఘ పెద్దలు కోరు కమిటీ సభ్యులు బాలస్వామి , జనార్ధన్ చిరంజీవి , బాబురావు , జ్యోతి సుదర్శనం వీరబాబు పాల్గొన్నారు . నాగరాజు బాలస్వామి శాస్త్రి బట్టు జోసెఫ్ రామకృష్ణ ప్రభుదాస్ తదితరులు ఉన్నారు