-బి.ఎం.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 28 :
సింగరేణిలో పనిచేస్తున్న బదిలీ వర్కర్,జనరల్ మజ్దూర్ కార్మికులకు డిజిగ్నేషన్ మార్పు చేసి జనరల్ అసిస్టెంట్ గా జాబ్ డిస్క్రిప్షన్ నామెన్ క్లాచర్ గా సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య తెలిపారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి పరిశ్రమలో బదిలీ వర్కర్ జనరల్ మజ్దూర్ అనే డిజిగ్నేషన్ సింగరేణి పరిశ్రమ చరిత్రలో ఏళ్ల తరబడి సామాజిక అసమానతలకు గురవుతున్నారని అన్నారు. సింగరేణి పర్యటనలో గుర్తించిన కొత్త కాపు లక్ష్మారెడ్డి బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ సిఎంపిఎఫ్ ట్రస్ట్రీ బోర్డ్ సభ్యుల ఆదేశాల మేరకు జైసల్మార్ రాజస్థాన్ లో జరిగిన 2వ స్టాండర్డ్ డైజేషన్ కమిటీ సమావేశంలో స్టాండర్డ్ డైజేషన్ కమిటీ సభ్యులు సుధీర్ గురుడే, మజ్రుల్ హక్ అన్సారి, ల ద్రుష్టికి తీసుకెళ్లారు. కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యంతో చర్చించి బదిలీ వర్కర్ జనరల్ మజ్దూర్ డెసిగ్నేషన్ వెంటనే రద్దు చేస్తూ పరిశ్రమలలో గౌరవప్రదమైన తోటి కార్మికులతో ఉండే విధంగా “జనరల్ అసిస్టెంట్ గా”మారుస్తు ఒప్పందం జరిగిన అమలుపై జాప్యం చేస్తున్న కోల్ ఇండియా యాజమాన్యం ప్రతినిధులతో మాట్లాడి అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కొత్త కాపు లక్ష్మారెడ్డి కోరిన వెంటనే స్పందించిన కోల్ ఇండియా యాజమాన్యం ప్రతినిధులు అమలు చేయుటకు ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తామని తెలిపారని వారన్నారు. ఈ సమావేశంలో దునికైన రమేష్ గౌడ్, ఏరియా ఉపాధ్యక్షులు గుర్రం ప్రదీప్ కుమార్ లు పాల్గొన్నారు.