ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 10 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రాష్ట్రంలో 11600 కోట్లు నిధులు మంజూరు కాగా మన మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో గల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి 200 కోట్లు కేటాయించినందుకు
దండేపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, సంబరాలు జరుపుకున్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు చెయడం సోమవారం జరిగింది,
ఈ సందర్భంగా నాయకులకు మాట్లాడుతూ…ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు 200 కోట్లు రూపాయలు మంజూరు చేసిన ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ,మన మంచిర్యాల నియోజకవర్గానికి కృషి చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,మాజీ ఎంపీటీసీ గడ్డం త్రిమూర్తి,మాజీ వైస్ ఎంపీటీసీ ఆకుల రాజేందర్, ఎంపీటీసీ లు,ముత్యాల శ్రీనివాస్,తోట మోహన్,ముత్తె రాజయ్య, సీనియర్ నాయకులు గడ్డం రామచందర్,ముత్తే నారాయణ, చుంచు నగేష్, మండల అధ్యక్షుడులు,అక్కల వెంకటేశ్వర్లు,పింగళి రమేష్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం,మార్కెట్ కమిటీ వైఎస్ చెర్మన్ ఎండీ ఆరిఫ్,అంకతి శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్, మున్సిపాలిటీ నాయకులు, మాజీ ఎంపీటీసీ లు, సర్పంచులు,వార్డ్ మెంబర్,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking