ముస్లిం స్మశాన వాటికను తన సొంత ఖర్చులతో శుభ్రం చేయించిన ఖమ్మం పార్లమెంటు ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్ధి మహ్మద్ రసూల్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 26 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా చింతకాని మండలం ముష్టికుంట గ్రామంలో చాలా రోజుల నుంచి ముస్లిం స్మశాన వాటిక అనేక పిచ్చి మొక్కలతో నిండి ఉన్నది స్మశాన వాటికను శుభ్రపరచడానికి గ్రామస్తులు అధికారులకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న శుభ్రం చేయించలేదు దీనిపై స్పందించిన ఖమ్మం పార్లమెంటు ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్ధి మహ్మద్ రసూల్ తన సొంత ఖర్చులతో దగ్గరుండి ముస్లిం స్మశాన వాటిక లో పిచ్చి మొక్కలు తొలగించి బ్లీచింగ్ చల్లించారు ఈ సందర్భంగా రసూల్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో గల స్మశానవాటికల్లో పిచ్చి మొక్కలు తొలగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను నాయకులను కోరారు ఈ కార్యక్రమంలో షేక్ రంజాన్ షేక్ రఫీ ముస్లిం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు