బోయిన్ పల్లి నుండి మేడ్చెల్ వరకు నిర్మిస్తున్న 6 లైన్ల రోడ్డు విస్తీర్ణం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 21:
జాతీయ రహాదారి ఎన్ హెచ్-44రోడ్డు విస్తీర్ణంలో భాగంగా బోయిన్ పల్లి నుండి మేడ్చెల్ వరకు వెయి కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు విస్తీర్ణం పనులలో ఎదురయ్య సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సహాకరించి, నిర్మాణ పనులు పూర్తయేల చూడాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం తెలిపారు.
బోయిన్ పల్లి నుండి మేడ్చెల్ వరకు నిర్మిస్తున్న 6 లైన్ల రోడ్డు విస్తీర్ణం పనులపై బుధవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్సు హాలో జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి కలిసి కలెక్టరు గౌతం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు విస్తీర్ణంలో ఎదురవుతున్న సమస్యల గురించి ప్రాజెక్టు డైరెక్టరును అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తీర్ణంలో గల ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో అడ్డుగా ఉన్న పెట్రోల్ బంక్ అనుమతులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారికి సూచనలు చేసారు. అండర్ పాస్ స్లిప్ రోడ్ పనులు, విద్యుత్ టవర్స్, డ్రెయిన్లు, పైప్ లైన్స్ పనులకు ఆటంకం కలుగకుండా సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తొందరగా ఇతర స్థలాలో అవార్డులు క్లియరెన్స్ కు చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు మ్యుటేషన్ చెల్లింపు జరిగిన స్థలాలు అప్పగించుటకై సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.హెచ్.ఎ.ఐ, ఆర్డిఓలు ఉపేందర్, శ్యాంప్రకాష్, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.