విలేకర్ల సమావేశంలో పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ మల్లయ్య
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 15 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు హైదరాబాద్ లో జరిగే విజయభేరి బహిరంగ సభతో ఎన్నికల కధనబేరి ప్రారంభమవుతుందని పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య తెలిపారు. ఈ నెల 17వ తారీఖున హైదరాబాద్ సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో తుక్కుగూడా లో జరగనున్న కాంగ్రెస్ విజయభేరి సభకు పాలేరు నియోజకవర్గం నుండి భారీగా తరలి రావాలని కార్యక్రమ ఇంచార్జ్ పీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య తెలిపారు తోలుత కూసుమంచి మండలంలోని మల్లాయిగూడెం గ్రామంలో 18వ తారీఖున సిడబ్ల్యూసి ఇంచార్జ్ మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెల ప్రారంభించి జెండా ఆవిష్కరించునున్నట్లు తెలిపారు