చీరల పంపిణీలతో పాటు అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు

 

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 05 అక్టోబర్ 2023:రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ అంతర్గతంగా ఉన్న మణికొండ పురపాలక సంఘం పరిధిలో తెలుగింటి ఆడపడుచులకు మా ఇంటి పెద్దన్నగా ప్రసిద్ధికెక్కిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆడపడుచులందరికీ బతుకమ్మా దీవించండి అని వేడుకుంటూ బహు చక్కని కానుకగా ఆడపడుచులకు లాంఛనంగా రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు మన చిన్నన్న ప్రకాష్ గౌడ్ ద్వారా చీరల పంపిణీ చేయడం జరిగినది మరియూ మునిసిపాలిటీ వారి బహు చక్కని ఆలోచనలతో 10 కోట్ల 72 లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులకు అసెంబ్లీ హాట్రిక్ శాసన సభ్యుడు టీ. ప్రకాష్ గౌడ్ హస్తాలతో మొదటగా 55 లక్షలతో హనుమాన్ నగర్లో కమ్యూనిటీ హాల్ను, మణికొండలో ఉన్న వైకుంఠ ధామంలను అభివృద్ధి పర్చడానికి: వరుసగా 1 కోటి 70 లక్షలతో, 1 కోటి 60 లక్షలతో మరియు 1 కోటి 55 లక్షలతో, 2 కోట్లతో దోభీ ఘట్ అభివృద్ధిని, 50 లక్షలతో చిత్రపురిలో ఉన్న పార్క్ అభివృద్ధిని, 40 లక్షలతో శివాజీ నగర్ నాలా రిటర్నింగ్ వాల్ కట్టడాన్ని, 32 లక్షలతో తిరుమల హిల్స్ లో ఉన్న పార్క్ అభివృద్ధి పనులను, 15 లక్షలతో చింతచెట్టు పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ కొరకై, 1 కోటి 10 లక్షలతో స్వామీ వివేకానంద పార్క్ అభివృద్ధి పనులను, 80 లక్షలతో నేక్నంపుర్ లో ఉన్న సరస్సు రైలింగ్ పనులను అన్నింటి ప్రారభోత్సవాలను గావించిన శుభ ఘడియలలో స్థానిక చైర్మన్ కస్తూరి నరేందర్, మునిసిపాలిటీ కమిషనర్ ఫాల్గుణ కుమార్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీ.ఆర్.యస్. పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, కోప్షన్ మెంబర్లు, అన్ని పార్టీల స్థానిక ప్రజా నాయకులూ, మునిసిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని తమ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking