ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ఏఐ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
వెంకట్రావు పేటలో ఏఐ ప్రోగ్రాం ప్రారంభం
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 15 : విద్యకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, కంప్యూటర్ ఏఐ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ప్రోగ్రాం కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావులు పాల్గొన్నారు.అనంతరం కంప్యూటర్ తరగతి గదిని ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…నేటి విద్యా వ్యవస్థలో కృత్రిమ మేదో విద్యా చాలా అవసరమని, అది నేర్చొకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు.ఈ కార్యక్రమంలో డీఈవో యాదయ్య,సంబంధిత అధికారులు,కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేల రాజు,నాయకులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.