జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్
రైతు సంబరాల్లో పలు చోట్ల హాజరు
ఖమ్మం ప్రతినిధి జులై 19 (ప్రజాబలం) ఖమ్మం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని రైతుల కళ్ళల్లో ఆనందం నింపాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అన్నారు. రైతు సంబరాల్లో భాగంగా గురువారం ఆయన ఖమ్మం మార్కెట్ లో దిగుమతి శాఖ అద్యక్షులు దిరిశాల చినవెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, రఘునాథ పాలెం మండలం శివాయిగూడెం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా బాలాజి నాయక్ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తో కలిసి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….నేడు అన్నదాతల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమకావడం తెలంగాణ రైతన్న చరిత్ర లో సువర్ణక్షరాలతో లిఖించాల్సిన రోజని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపిన రేవంత్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం గా ఉంచి అభివృద్ధి పథంలో నడిపియాలని రైతులందరు ఆశీర్వదించారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడ్తూ మాపై నమ్మకం తో అధికార పిఠాన్ని ఇచ్చిన యావత్ తెలంగాణ రాష్ట్ర రైతన్న ఋణం తీర్చుకునే శుభతరుణం ఈ రోజని ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో శివాయిగూడెం గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమములో వీరితో పాటు మాజి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ మానుకొండ రాధకిషోర్ కార్పొరేటర్ మలీదు జగన్, కొప్పెర ఉపేందర్, గుత్తా వేంకటేశ్వరరావు, సాదే శంకర్, తల్లాడ రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.