మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ దాడి పై ఖండించిన కాంగ్రెస్ నాయకులు

 

ప్రజాబలం హాజీపూర్ మండల రిపోర్టర్ అక్టోబర్ 19 : మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలంలో రాపల్లి గ్రామంలో శుక్రవారం మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ అదే గ్రామానికి ముగ్గురు యువకుల మధ్య జరిగిన పరస్పర దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని కాంగ్రెస్ పరామర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో దాడి జరిగిన తంగెళ్ల రాజేష్,దేవనేని రాజశేఖర్ లు చికిత్స పొందుతున్నారు వారిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి తో పాటు హాజీపూర్ మండల కాంగ్రెస్ శ్రేణులు పరామర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… దాడిలో గాయపడిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అండగా ఉన్నారని భరోసా కల్పించారు. అనంతరం పూదరి తిరుపతి,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు నియోజకవర్గంలో ప్రజల ఆదరణ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులఫై దాడులకు పల్పడుతున్నారని మండిపడ్డారు.ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను బదునం చేయాలనే ఉద్దేశ్యంతోనే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తన అనుచరులతో కాంగ్రెస్ నాయకుల పైన దాడులు చేస్తున్నారని అన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ హాజీపూర్ మండల అధ్యక్షులు తోట తిరుపతి మాట్లాడుతూ…మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి కాంగ్రెస్ నాయకులపై ఎదురు దాడి చేస్తూ తన పైన దాడి చేశారని హైడ్రామా సృష్టించడం విడ్డురంగా ఉండాని హెద్దేవా చేశారు.గత పది సంవత్సరాలలో పొలిసు వ్యవస్థను మందపల్లి శ్రీనివాస్ గుప్పిట్లో ఉంచుకొని తనపైన అనేక కేసులు నమోదు చేశాడని తెలిపారు.బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపైన దాడులు చేస్తూ కాంగ్రెస్ నాయకుల దాడి చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మందపల్లి శ్రీనివాస్ గుడిపేట్ ఆర్&ఆర్ కాలనిలో ప్రభుత్వ పాట్లను ఆక్రమించి 5 లక్షల చొప్పున అమ్ముకున్నారని తెలిపారు.రాపల్లి ఆర్ & ఆర్ కాలనిలో తనకు ప్రభుత్వం కేటాయించిన పాట్లనుతో పాటు మరికొంత భూమిని ఆక్రమించుని ఇంటి నిర్మాణం చెప్ప్తాని తెలిపారు.బిఆర్ఎస్ నాయకులు అక్రమాలు చేయలేదని మంచివారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ అనడం సిగ్గు చేటని అన్నారు.బిఆర్ఎస్ నాయకులు ఎలాంటి అక్రమాలు చేయలేదని నిరూపించాలంటే ఆదివారం గుడిపేట్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలనీ దివాకర్ రావు కు తోట రవి సవాల్ విసిరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking