ప్రజాబలం వార్తకు స్పందన ఫిట్టింగైన మహిళా జిమ్

స్పందించిన కొత్త చైర్మన్ శ్రీనివాస్

జగిత్యాల, ఫిబ్రవరి 18, (ప్రజాబలం ప్రతినిధి): “మహిళా జిమ్ ఏర్పాటుకు మోక్షమెప్పుడో..” అనే శీర్షికన ఈ నెల 4 న ప్రజాబలం దిన పత్రికలో వచ్చిన కథనానికి కొత్త మునిసిపల్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ వెంటనే స్పందించారు. 5 వ తేదీనే మినిస్టేడియం లోని వాకర్స్ అసోసియేషన్ సబ్యులకు మహిళా జిమ్ ఏర్పాటు కోసం పోగొట్టిన నట్ల స్థానం లో కొత్త వాటిని తెప్పిస్తున్నామని చైర్మన్ శ్రీనివాస్ సమాచారం. అందించారు. మహాశివరాత్రి పర్వదినాన మినిస్టేడియంలోని మహిళా వాకర్స్ కు అందుబాటులో తెచ్చారు. స్పందించిన చైర్మన్ శ్రీనివాస్ కు వాకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking