నిర్విరామంగా శివోహం ఆర్ట్స్‌ క్యాంప్‌ కార్యాక్రమం

మహ శివరాత్రి పండుగ శుభ సందర్బంగా గత మూడు రోజులుగా మనికొండ మునిసిపల్‌ కౌన్సిల్‌ లోని శ్రీరామ్‌ నగర్‌ సెక్రేటేరియట్‌ కాలనీ వారి సహాయ సహకారాలతో కమ్యూనిటీ హాల్లో కాళీపట్నం ఆర్ట్స్‌ అకాడమీ తరఫున శివోహం ఆర్ట్స్‌ క్యాంప్‌ నిర్విరామంగా నిర్వహించడం జరిగినది, ఈ శుభ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజి డీజీపీ కే. అరవింద్‌ రావు, ప్రముఖ కళాకారుడు అసోసియేషన్‌ అధ్యక్షుడు చిలివెరు మనోహర్‌ లు క్యాంప్‌ లో పాల్గొన్న చిత్ర లేఖన కళాకారులని సముచిత గౌరవంతో చిరుకానుకలతో సన్మానించారు, అసోసియేషన్‌ పెద్దలందరితో పాటు కోశాధికారి జె. మాధవ్‌ రావు, ప్రముఖ రూప చిత్రణ (పొట్రైట్‌) కళాకారుడు మరియు వీ ఆర్‌ ఫర్‌ యు సంస్థ అధ్యక్షుడు బత్తుల బాపూజీ, కార్యదర్శి డీ ఎస్‌ ఆర్‌ దాస్‌, కోశాధికారి దిలీప్‌ కక్కడ్‌, సభ్యులు అందె లక్ష్మణ్‌ రావు, జీ వీ సూర్యనారాయణ, శివరామకృష్ణ, విజయలక్ష్మి, కాలనీ వాసులు, పురప్రజలు తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking