ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 19
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 7 వ వార్డులోని రాక్ గార్డెన్ వద్ద చేపట్టడం జరిగింది. పరిసర ప్రాంతాలను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు.అలాగే చెట్లకు పాదులు చేసి నీళ్లు పోశారు. గ్రామంలో ఇప్పటివరకు నిరంతరాయంగా 347 వారాలుగా స్వచ్ భారత్ కార్యక్రమాన్ని చేపడుతూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ,brs నాయకులు మన్నే నవీన్ యాదవ్,పాప నర్సింహులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
Next Post