ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 19 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో ప్రతి ఆదివారం నిర్వహించే వార సంతలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి 11 మందిని గాయపరిచినట్లు ప్రభుత్వ వైద్యాధికారి పవిత్ర తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక పాత బస్ స్టాండ్ ఏరియాలో పాదచారులపై ఒక్కసారిగా దాడి చేయడంతో జనాలు భయాందోళనకు గురైనట్లు తెలిపారు.వీరిలో తీవ్ర గాయాలైనటువంటి 9 మందిని మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు.ముగ్గురికి వాక్సిన్ వేసి చికిత్స అందించారు.

కాగా,మున్సిపాలిటీ లో గత కొన్ని రోజులుగా పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ పగలు,రాత్రి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నప్పటికీ పాలక వర్గం అవసరమైన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కొన్ని ఏరియాల్లో పిచ్చి కుక్కల చర్మం ఊడిపోయి పుండ్లు ఏర్పడిన కూడా వాటిని మున్సిపాలిటీ పాలక, అధికార వర్గాలు చూసి చూడనట్లు వ్యవహారిస్తుండటం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.