చత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటి యువతకు ఆదర్శం

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట చత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని శివాజీ సేన వ్యవస్థాపకులు వేముల మధు అన్నారు.పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఆదివారం శివాజీ సేన అధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ సేన వ్యవస్థాపకుడు మాట్లాడుతూ..16 సంవత్సరాల వయసులోనే పరాయి పాలకుల సమర శంఖం పూరించి దేశ భక్తిని చాటుకుని, మరట్వాడ రాజ్య స్థాపన చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు.శివాజీ జీవితం నుంచి యువకులు జాతీయత,దేశ భక్తి,మాతృ భక్తి నేర్చు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బోప్పు సతీష్,రాజలింగు,శివ శంకర్,శ్రీకాంత్,సుధాకర్ తదతరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking