కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి ని కురుమ, యాదవులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

డిసిసిబి డైరెక్టర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల మల్లి బాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 29 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కేంద్ర మంత్రివర్యులు సురేందర్ రెడ్డి తనయుడు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామ సహాయం రఘురాం రెడ్డి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారని, వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కురుమ యాదవుల పై ఉందని డిసిసిబి డైరెక్టర్, జిల్లా అఖిలభారతయాదవ మహాసభ గౌరవాధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్ పిలుపునిచ్చారు
సోమవారం నాడు నెలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన యాదవ కురుమ ముఖ్యుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యాదవ కురుమలకు 1993 వరకు ఎలాంటి గుర్తింపు లేదని, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంత్రివర్యులు రఘువీరారెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకం దారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, 2006లో గొర్రెల పెంపకం దారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసింది, రుణాలు మంజూరు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈనాడు మనం కాస్తో కూస్తో ప్రభుత్వాల నుండి గుర్తింపు వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యపడిందని, గత ప్రభుత్వం గొర్రెల పథకం మొదటి విడతలో లక్షా పాతిక వేల రూపాయలు ఇస్తామని చెప్పి, అధికారులు దళారులు ముఖ్య నాయకులు కలిసి ట్రాన్స్ పోర్ట్ వెహికల్ కి తప్పుడు నెంబర్లు చూపించి ఇవ్వకుండా ఇచ్చామని మోసం చేయడం జరిగిందని, ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారం బయటపడిందని, ఈ విషయంలో డైరెక్ట రేట్ లోని నలుగురు అధికారులను అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగిందని, కేసు పెండింగ్ లో ఉండటం వలన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఇవ్వలేకపోవడం జరిగిందని, మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అందుకే కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ని గెలిపించు కోవలసిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మాజీ డైరెక్టర్ మల్లె పోయిన శ్రీనివాస్ యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ వెన్నపూసల సీతారాములుయాదవ్,మండే వెంకటేష్, రవి, శేఖర్, లిక్కి హనుమంతరావు, చిలకల భూషయ్య, మన్నే రవి, మన్నే కోటేశ్వరరావు, మారుతి కోటి, మేకల శ్రీను, రెడ్డి బోయిన నవీన్, ఎర్రబోయిన నరసయ్య చిలకల లింగయ్య, బాలిని శ్రీశైలం పల్లెబోయిన శ్రీనివాస్, మన్నే శ్రీను, మెట్టెల నాగేశ్వరరావు, చిలకల ఎర్రయ్య పేరం నరేష్ చిలకల నగేష్, పరిటాల వలరాజు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking