కురుమ యాదవుల ను నమ్మించి మోసం చేసిన బి ఆర్ ఎస్ ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి ని గెలిపించాలి
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షరాలు యనమల రుక్మిణి యాదవ్
ఖమ్మం ప్రతినిధి మే 4 (ప్రజాబలం) కురుమ యాదవులను కోటీశ్వరులను చేస్తానని, యాదవులు మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పరని అభివృద్ధి చేస్తానని, మాయమాటలు చెప్పి, మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డిసిసిబి డైరెక్టర్ అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ రోజు కల్లూరు మండల యాదవ సంఘం సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాట తప్పని కురుమ యాదవులను కడుపులో పెట్టుకుని, వారి సంక్షేమం అభివృద్ధి చూసుకుంటానని, కోటీశ్వరులను చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రగల్బాలు పలికిన కెసిఆర్ డీడీలు కట్టించుకుని రెండు సంవత్సరములు ఉంచుకొని చేతులెత్తేసిన కెసిఆర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని యాదవులను ఓట్లు అడుగుతున్నారని మల్లి బాబు యాదవ్ విమర్శించారు. మొదటి విడతలో కంటి తుడుపుగా గొర్రెలు దళారులు అధికార పార్టీ నాయకులు అధికారులు కలిసి పేరుకు లక్షాపాతికి వేల రూపాయలు ఇస్తామని, ఆంధ్ర దళారులతో చేతులు కలిపిమోసం చేసిన చరిత్ర కలిగిన బి ఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని, ఇలాంటి కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు అడిగే వారిని నమ్మవద్దని, తెలిపారు. కురుమ యాదవుల అభివృద్ధి, గుర్తింపు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని, ఆ పార్టీ ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలే నేటి వరకు ఉన్నాయని, కొత్తగా బి ఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, కురుమ యాదవులంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని మల్లి బాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యనుముల రాము, మార్త వీరయ్య, మార్త వెంకటేశ్వర్లు పొదిలి వెంకటేశ్వర్లు గంగుల వెంకటేశ్వర్లు, తోట సుబ్బారావు కాలసాని రామకోటయ్య వెంకటకృష్ణ, శీలం వినోద్ మెట్టెల ఉపేందర్ ఇమ్మడి రామనాథం, వీర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు