డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కి వినతిపత్రం అందించిన కాంగ్రెస్ కార్యకర్తలు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 24 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ సీటుపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆపార్టీ నాయకులు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు నామినేషన్ కు గడువు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండగా ఇంతవరకు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఖమ్మం పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులు గా ఇతర జిల్లాలకు చెందిన వారి పేర్లు వినిపిస్తున్నాయి దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన వారికే టిక్కెట్ కేటాయించేలా చూడాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి వినతిపత్రం అందజేశారు పార్టీని పటిష్ట పరిచేందుకు ఏళ్ల తరబడి కృషి చేసిన వారికి పార్లమెంట్ టిక్కెట్ వచ్చేలా చూడాలని వారు కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking