ఈనెల 6న జరిగే పాలేరు నియోజకవర్గ యాదవుల విస్తృత స్థాయి సమావేశమును జయప్రదం చేయండి

ప్రచారం కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 4 (ప్రజాబలం) అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈనెల 6 వ తారీఖున ఎస్ ఆర్ బ్రదర్స్ ఫంక్షన్ హాల్, కూసుమంచిలో పాలేరు నియోజకవర్గం స్థాయి యాదవులు, గొర్రెల పెంపకం దారుల సమావేశం జరుగుతుందని, యాదవుల,గొర్రెల పెంపకం దారుల సమస్యల పరిష్కారం కొరకు జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్, పిలుపునిచ్చారు తిరుమలాయపాలెం, కూసుమంచి,నేలకొండపల్లి మండ లాలలో పాలేరు నియోజకవర్గ స్థాయి యాదవుల విస్తృత స్థాయి సమావేశము కొరకు కరపత్రాల ప్రచార కార్యక్రమం జరిగింది. అనంతరం అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడిచినప్పటికీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఏ విధమైన హామీ నెరవేర్చలేదని , యాదవుల కులవృత్తి అయిన గొర్రెల పెంపకమును అభివృద్ధి చేస్తామని యాదవులకు అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని, ఇలాంటి హామీలు ఇచ్చి, గత ప్రభుత్వం కూడా మోసం చేసిందని, మళ్లీ ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తే తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో యాదవులకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గొర్రెల పెంపకం దారులకు న్యాయం చేయాలని, చేయని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఐక్యంగా సమస్యలపై పోరాడి సాధించవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లె బోయిన శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ లింగయ్య దొడ్డి సాంబయ్య కురుమ,మన్నె కృష్ణ చిలకల భూషయ్య, మెట్టెల నాగేశ్వరరావు, కనక బండి రమేష్ మేకల ప్రసాద్, దిడ్డి ప్రసాదు, మేకల సైదులు వల్లపు నాగయ్య, జక్కుల యాదగిరి, చెన్ను వెంకటరమణ, భారీ వీరభద్రం భారీ సురేష్ బాలినశ్రీశైలం ,పల్లెబోయిన శ్రీను, తెల్లబోయిన రమణ,మన్నె రాధాకృష్ణ మన్నె శ్రీను చిలకల ఎర్రయ్య, మేకల శ్రీను, మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking