“సంజయ్” కేసులో కోర్టు సీరియస్

వైఎస్సార్టిపి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ

జగిత్యాల ప్రతినిధి, మే 6:(ప్రజాబలం) కోరుట్ల ఎమ్మెల్యే తనయుడు సంజయ్ రావు కేసులో అధికారుల గైర్హాజర్ పై న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి సీరియస్ అయినట్లు వైఎస్సార్టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో కోరుట్ల నియోజక వర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కల్యాణ లక్ష్మి, షాధిముభారక్ పంపిణీలో కోరుట్ల ఎమ్మెల్యే తనయుడు కల్వకుంట్ల సంజయ్ రావు పాల్గోని పంపిణీ చేయడాన్ని వైఎస్సార్ పార్టీ పక్షాన అభ్యంతరం వ్యక్తం చేశామని సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక్కడికె ఆగిపోక స్థానిక ఎమ్మెర్వోలకు, ఆర్డీవో కు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం రాలేదన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 20న కార్యదర్శి, న్యాయసేవాదికార సంస్థలో కేసు నమోదు చేశామని సత్యనారాయణ పేర్కొన్నారు. తదుపరి ముడుపర్యాయాలు కోర్టుకు అధికారులు గైర్హాజరు కావడం తో శనివారం న్యాయమూర్తి ప్రసాద్ సీరియస్ అయినట్లు కలెక్టరుకు నోటీసులు పంపనున్నట్లు వైఎస్సార్టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking